అమెరికాలో భారత ఔషధాన్నే ముందు వాడుతున్నారు

అమెరికాలోని చాలా ఆస్పత్రుల్లో కొవిడ్‌-19 చికిత్సకు మొదట మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)నే ఉపయోగిస్తున్నారని మెడికల్‌ పబ్లికేషన్‌ ఎండీఎడ్జ్‌ తెలిపింది. ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌గా ధ్రువీకరించిన రోగులకు యేల్‌ న్యూ హెవెన్‌ హెల్త్‌ సిస్టమ్స్‌లో ముందుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్....

Updated : 02 May 2020 16:00 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని చాలా ఆస్పత్రుల్లో కొవిడ్‌-19 చికిత్సకు మొదట మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)నే ఉపయోగిస్తున్నారని మెడికల్‌ పబ్లికేషన్‌ ఎండీఎడ్జ్‌ తెలిపింది. ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌గా ధ్రువీకరించిన రోగులకు యేల్‌ న్యూ హెవెన్‌ హెల్త్‌ సిస్టమ్స్‌లో ముందుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్, రెండో ప్రాధాన్యంగా టొసిలిజుమాబ్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ సంస్థకు కనెక్టికట్‌లో కొన్ని ఆస్పత్రులు ఉన్నాయి.

మలేరియాను నయం చేసేందుకు ఏళ్ల తరబడి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. కొవిడ్‌-19పై పోరాటంలో ఈ ఔషధం ఒక గేమ్‌ ఛేంజర్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభివర్ణించారు. ఆయన స్వయంగా మోదీకి ఫోన్‌ చేసి అడగడంతో భారత్‌ వీటిని ఆ దేశానికి ఎగుమతి చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఈ డ్రగ్‌ను ఉత్పత్తి చేస్తోంది భారతే కావడం గమనార్హం.

‘యేల్‌ ఆస్పత్రుల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌నే మొదట ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వైరస్‌ను ఇది సమర్థంగా ఎదుర్కొంటోంది. వైద్యపరంగా ప్రయోజనం కలుగుతోంది. ప్రస్తుతానికి ఇంతకన్నా మంచిది లేదు’ అని భారత అమెరికన్‌ హృద్రోగ నిపుణుడు నిహార్‌ దేశాయ్‌ అన్నారు. ‘ఈ ఔషధం ధర తక్కువ. దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రజలూ దీంతో సౌకర్యంగానే ఉంటున్నారు. మేం సాధ్యమైనంత కృషి చేస్తున్నాం. ఇలాంటివి సంక్షోభాలు మళ్లీ రావొద్దనే ఆశిద్దాం’ అని ఆయన అన్నారు.

చదవండి: ట్రంప్‌ విమర్శిస్తున్నా చైనాను ప్రశంసించిన డబ్ల్యూహెచ్‌వో

చదవండి: హెచ్‌-1బీ వీసాదారులకు ఊరట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని