యూఏఈలో ఉన్నవారి కోసం రంగంలోకి నావికాదళం!

కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా విధించిన ఆంక్షల వల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.......

Published : 05 May 2020 09:16 IST

కొచ్చి: కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా విధించిన ఆంక్షల వల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), మాల్దీవుల్లో చిక్కుకుపోయిన వారిని తీసుకొచ్చేందుకు నావికాదళం రంగంలోకి దిగింది. ఐఎన్‌ఎస్‌ జలశ్వ, ఐఎన్‌ఎస్‌ మగర్‌ మాల్దీవులకు వెళ్లగా.. ఐఎన్‌ఎస్‌ శార్దూల్‌ దుబాయ్‌ దిశగా వెళ్లింది. సోమవారం రాత్రి ఇవి బయలుదేరినట్లు భారత నావికాదళానికి చెందిన అధికార ప్రతినిధి తెలిపారు. తిరిగి ఇవి కొచ్చికి చేరుకోనున్నట్లు వెల్లడించారు. ఐఎస్‌ఎస్‌ మగర్‌, ఐఎస్‌ఎస్‌ శార్దూల్‌ దక్షిణ నావికా దళానికి, ఐఎస్‌ఎస్‌ జలశ్వ తూర్పు నావికాదళానికి చెందినవి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని