కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి అర్జున్‌ చరణ్‌ సేథీ(78) కన్నుమూశారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.  2000-2004 మధ్య

Updated : 08 Jun 2020 23:36 IST

ఒడిశా: కేంద్ర మాజీ మంత్రి అర్జున్‌ చరణ్‌ సేథీ(78) కన్నుమూశారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.  2000-2004 మధ్య వాజ్‌పేయ్‌ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా అర్జున్‌ చరణ్‌ సేథీ సేవలందించారు. 1971లో భద్రక్ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1980, 1991, 1998, 1999, 2004, 2009 ఎన్నికల్లో అర్జున్‌ చరణ్‌ సేథీ లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో బీజేడీని వీడి భాజపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని