భార‌త్-చైనా: మూడోసారి చ‌ర్చ‌లు ప్రారంభం!

తూర్పు లద్దాఖ్‌లో వాస్త‌వాధీన రేఖ వెంట‌ చైనా దురాక్ర‌మ‌ణ‌పై కొన‌సాగుతున్న వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు భార‌త్‌, చైనా సైనికాధికారులు నేడు మ‌రోసారి భేటీ అయ్యారు. ఇరుదేశాల కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయి అధికారుల స‌మావేశం ఈ ఉద‌యం ప్రారంభం అయిన‌ట్లు భార‌త సైనికాధికారులు వెల్ల‌డించారు.

Published : 30 Jun 2020 13:27 IST

కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయి అధికారులు భేటీ

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్త‌వాధీన రేఖ వెంట‌ చైనా దురాక్ర‌మ‌ణ‌ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు భార‌త్‌, చైనా సైనికాధికారులు నేడు మ‌రోసారి భేటీ అయ్యారు. ఇరుదేశాల కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయి అధికారుల స‌మావేశం ఈ ఉద‌యం ప్రారంభం అయిన‌ట్లు భార‌త సైనికాధికారులు వెల్ల‌డించారు. గ‌త కొంత‌కాలంగా స‌రిహ‌ద్దు ప్రాంతంలో నెల‌కొన్న ఉద్రిక్తత‌ల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నంలో భాగంగా జ‌రుగుతున్న‌ ఈ చ‌ర్చ‌లు నేడు చుశూల్ ప్రాంతంలో ప్రారంభ‌మ‌య్యాయి. ఇరుదేశాల కమాండ‌ర్ స్థాయి అధికారులు ఇప్ప‌టికే రెండుసార్లు చ‌ర్చ‌లు జ‌రుప‌గా తాజాగా ఈ ఉదయం మూడోసారి భేటీ అయ్యారు. జూన్ 6న తొలిసారిగా భేటీ కాగా, జూన్ 22న రెండోసారి స‌మావేశమై చ‌ర్చించారు. గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ అనంత‌రం జ‌రిగిన స‌మావేశంలో ఇరుదేశాల సైన్యం ల‌ద్దాఖ్ సెక్టార్ నుంచి దూరంగా వెళ్ల‌డంపై ఏకాభిప్రాయానికి వ‌చ్చినప్ప‌టికీ, అనంత‌రం భార‌త్ ప్ర‌తిపాద‌న‌ల‌పై చైనా వెన‌క్కి త‌గ్గిన‌ట్టు స‌మాచారం. అయితే, గ‌తంలో జ‌రిగిన‌ చ‌ర్చ‌లు చుశూల్‌లోని చైనా భూభాగం వైపు ఉన్న‌ మోల్డో ప్రాంతంలో జ‌రుగ‌గా, ఈసారి మాత్రం భార‌త్‌వైపు జ‌రుగుతున్నాయి.

ఇదిలా ఉంటే, తూర్పు లాద్దాఖ్‌లోని గ‌ల్వాన్ లోయ స‌మీపంలో జ‌రిగిన‌ ఘ‌ర్ష‌ణలో 20మంది భార‌త సైనికులు అమ‌రులైన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ర్ష‌ణ‌లో దాదాపు 43మంది చైనా సైనికులు కూడా మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని