కోర్టు కాంప్లెక్స్‌ను పేల్చేస్తామని లేఖలు

కోర్టు భవనాల్ని పేల్చేస్తామంటూ చండీగఢ్‌ జిల్లా, పంచకుల కోర్టులకు వచ్చిన బాంబు బెదిరింపు లేఖలు కలకలం సృష్టించాయి.

Published : 25 Jan 2023 04:49 IST

అప్రమత్తమైన చండీగఢ్‌ పోలీసులు
ఉత్తిదేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

చండీగఢ్‌: కోర్టు భవనాల్ని పేల్చేస్తామంటూ చండీగఢ్‌ జిల్లా, పంచకుల కోర్టులకు వచ్చిన బాంబు బెదిరింపు లేఖలు కలకలం సృష్టించాయి. న్యాయమూర్తి కాంప్లెక్స్‌లో బాంబు పెట్టామని.. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పేలుతుందని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు పరిసరాల్లో ఉన్న వారందరినీ బయటకు పంపించి.. తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు నిర్వీర్య బృందం, డాగ్‌ స్క్వాడ్‌ ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. కోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఒక టిఫిన్‌ బాక్సును గుర్తించారు. అయితే అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని స్పష్టంచేశారు. ఇదంతా ఉత్తిదేనని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోర్టులను పేల్చేస్తామని బాంబు బెదిరింపు లేఖ తమకు వచ్చిందని ఏసీపీ సురేంద్ర యాదవ్‌ చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఈ ఘటన జరగడం భయాందోళనలకు గురిచేస్తోంది. మొదట మాక్‌ డ్రిల్‌ అని చెప్పిన పోలీసులు.. తర్వాత బాంబు బెదిరింపు లేఖ వచ్చినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని