ప్రయాణికులను వదిలేసిన ఘటన.. గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్‌కు రూ.10 లక్షల జరిమానా

మూత్రవిసర్జన ఘటనలో ఎయిరిండియాకు రూ.30 లక్షలు, మరో ఘటనలో రూ.10 లక్షలు జరిమానా విధించిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ).. మరో ఎయిర్‌లైన్‌ సంస్థకు ఇదే దండన విధించింది.

Updated : 28 Jan 2023 09:49 IST

దిల్లీ: మూత్రవిసర్జన ఘటనలో ఎయిరిండియాకు రూ.30 లక్షలు, మరో ఘటనలో రూ.10 లక్షలు జరిమానా విధించిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ).. మరో ఎయిర్‌లైన్‌ సంస్థకు ఇదే దండన విధించింది. ఈ నెల 9న గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం బెంగళూరు విమానాశ్రయంలో 55 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఆరోపణలతో సదరు ఎయిర్‌లైన్‌కు డీజీసీఏ రూ.10లక్షల జరిమానా విధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని