జమ్మూ కశ్మీర్‌కు రూ.35,581 కోట్లు

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌కు కేంద్ర బడ్జెట్‌ 2023-24లో రూ.35,581.44 కోట్లను కేటాయించారు. ఈ నిధుల్లో రూ.33,923 కోట్లు కేంద్ర సాయం.

Published : 02 Feb 2023 05:37 IST

దిల్లీ: కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌కు కేంద్ర బడ్జెట్‌ 2023-24లో రూ.35,581.44 కోట్లను కేటాయించారు. ఈ నిధుల్లో రూ.33,923 కోట్లు కేంద్ర సాయం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనా రూ.44,538.13 కోట్ల కంటే ఈ కేటాయింపు తక్కువ. ప్రస్తుత బడ్జెట్‌ నిధుల్ని... 2014లో జమ్ము కశ్మీర్‌లో వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాల శాశ్వత పునరుద్ధరణకు, శ్రీనగర్‌లోని దాల్‌-నాగీన్‌ సరస్సు పరిరక్షణకు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పునరావాసానికి వెచ్చిస్తారు. దీంతోపాటు 800 మెగావాట్ల రాల్టే హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు, 624 మెగావాట్ల కిరు హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు, 540 మెగావాట్ల క్వార్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు, జీలం-తవీ వరద నివారణ ప్రాజెక్టులకూ ఖర్చుచేస్తారు.

కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్‌ నికోబార్‌ దీవులకు రూ.5,987.14 కోట్లు, చండీగఢ్‌కు రూ.5,436.10 కోట్లు, లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు, పుదుచ్చేరికి రూ.3,117.77 కోట్లు, దాద్రా నగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌కు రూ.2,475 కోట్లు, లక్షద్వీప్‌నకు రూ.1,394.75 కోట్లు, దిల్లీకి రూ.1,168.01 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని