చిన్నారి ప్రాణం నిలబెట్టేందుకు రూ.పదకొండు కోట్లు.. పేరు చెప్పకుండా అకౌంట్‌లోకి..

అరుదైన వ్యాధితో బాధపడుతున్న 16 నెలల చిన్నారి చికిత్స కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.11 కోట్లు ఖాతాలో జమ చేశారు.

Updated : 23 Feb 2023 08:11 IST

అరుదైన వ్యాధితో బాధపడుతున్న 16 నెలల చిన్నారి చికిత్స కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.11 కోట్లు ఖాతాలో జమ చేశారు. విదేశాల్లో ఉంటున్న ఆయన తన పేరు చెప్పకుండా ఈ విరాళం అందజేశారు. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన నౌకాదళ అధికారి సారంగ్‌, అతిథి దంపతుల కుమారుడు నిర్వాణ్‌(16 నెలలు) పుట్టిన 15 నెలల తర్వాత కూడా కాళ్లు కదపలేదు. నిర్వాణ్‌కు స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ (ఎస్‌ఎంఏ) టైప్‌-2 అనే వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

రెండేళ్లు నిండకుండా కొన్ని రకాల ఔషధాలు వాడితేనే చికిత్సకు  వీలవుతుందని, వీటిని అమెరికా నుంచి తెప్పించేందుకు  రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఆ చిన్నారి కుటుంబం ఆర్థిక సహాయం కోసం అభ్యర్థించగా.. బాబు ఖాతాలోకి విరాళాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తన పేరు చెప్పకుండా ఓ వ్యక్తి రూ.11 కోట్లు జమచేశారు. దీంతో సారంగ్‌ దంపతుల ఆర్థిక కష్టాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లైంది. మరో రూ.80 లక్షలు వస్తే నిర్వాణ్‌ చికిత్సకు సరిపడా డబ్బులు సమకూరినట్లే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని