సురినామ్‌, సెర్బియాల్లో పర్యటించనున్న రాష్ట్రపతి

వచ్చే నెల 4 నుంచి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సురినామ్‌లో పర్యటించనున్నారు. గత ఏడాది జులైలో పదవిని చేపట్టాక ఆమె చేపడుతున్న తొలి అధికారిక పర్యటన ఇదేనని విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం తెలిపింది.

Published : 30 May 2023 05:17 IST

దిల్లీ: వచ్చే నెల 4 నుంచి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సురినామ్‌లో పర్యటించనున్నారు. గత ఏడాది జులైలో పదవిని చేపట్టాక ఆమె చేపడుతున్న తొలి అధికారిక పర్యటన ఇదేనని విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం తెలిపింది. ఈ యాత్రలో ఆమె సురినామ్‌ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్‌ సంతోఖితో సమావేశమవుతారు. ఆ దేశంలోకి భారతీయులు ప్రవేశించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించబోయే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. జూన్‌ 7 నుంచి ముర్ము.. సెర్బియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి ఒకరు ఆ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని