అమెరికా వెళ్లే ఎయిరిండియా విమానం ఇంజిన్‌లో సమస్య

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఇంజిన్లలో ఒక దానిలో సమస్య తలెత్తడంతో దానిని అత్యవసరంగా రష్యాలోని మగదాన్‌ నగరంలో దించారు.

Published : 07 Jun 2023 03:56 IST

రష్యాలోని మగదాన్‌లో అత్యవసరంగా దించివేత

ముంబయి: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఇంజిన్లలో ఒక దానిలో సమస్య తలెత్తడంతో దానిని అత్యవసరంగా రష్యాలోని మగదాన్‌ నగరంలో దించారు. మంగళవారం దిల్లీ నుంచి 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో బయలుదేరిన ఏఐ-173 విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తిందని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఆ విమానాన్ని రష్యాలో సురక్షితంగా దించామని, ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ప్రయాణికులకు స్థానిక హోటళ్లలో బస కల్పించామని, బుధవారం విమానం ఏర్పాటుచేసి వారందరినీ శాన్‌ఫ్రాన్సిస్కో తీసుకు వెళతామని ఎయిరిండియా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని