అనాయాస మరణానికి అనుమతివ్వండి

అనాయాస మరణానికి అనుమతి కోరుతూ జ్ఞానవాపి-శృంగార్‌ గౌరీ కేసులో ప్రధాన పిటిషనర్‌ రాఖీసింగ్‌.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు బహిరంగ లేఖ రాయడం కలకలం సృష్టిస్తోంది.

Published : 09 Jun 2023 05:20 IST

రాష్ట్రపతికి జ్ఞానవాపి మసీదు కేసులోని ప్రధాన పిటిషనర్‌ లేఖ

వారణాసి(యూపీ): అనాయాస మరణానికి అనుమతి కోరుతూ జ్ఞానవాపి-శృంగార్‌ గౌరీ కేసులో ప్రధాన పిటిషనర్‌ రాఖీసింగ్‌.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు బహిరంగ లేఖ రాయడం కలకలం సృష్టిస్తోంది. 2021 ఆగస్టులో మసీదు ప్రాంగణంలోని శృంగార్‌ గౌరీ విగ్రహాన్ని రోజూ పూజ చేసుకొనేందుకు అనుమతివ్వాలంటూ రాఖీసింగ్‌.. మరో నలుగురు హిందూ మహిళలతో కలిసి వారణాసి న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. అయితే ఇప్పుడు ఆ నలుగురు మహిళలు తనను వేధిస్తున్నారని, తాను కేసు నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని రాఖీసింగ్‌ లేఖలో వాపోయారు. కేసు ఉపసంహరణపై తాను గానీ.. తన మావయ్య జితేంద్రసింగ్‌ విసేన్‌ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. తనకు అనాయాస మరణం పొందేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. శుక్రవారం తొమ్మిది గంటలలోపు రాష్ట్రపతి నుంచి సమాధానం రాకపోతే.. ఆ తర్వాత తన నిర్ణయం తాను తీసుకుంటానని రాఖీసింగ్‌ చెప్పారు. వేధింపులు, వనరులు లేమి ఇతర కారణాలతో జ్ఞానవాపి కేసు నుంచి తాను, తన కుటుంబసభ్యులు వైదొలగుతున్నట్లు విసేన్‌ గత వారం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని