అధిక పింఛను దరఖాస్తు గడువు పొడిగింపు

ఉద్యోగుల భవిష్య నిధి చందాదారుల అధిక పింఛను ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తు గడువును ఈపీఎఫ్‌వో మరోసారి పొడిగించింది.

Updated : 27 Jun 2023 12:28 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి చందాదారుల అధిక పింఛను ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తు గడువును ఈపీఎఫ్‌వో మరోసారి పొడిగించింది. తొలుత మే 3వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియగా.. జూన్‌ 26 వరకూ పొడిగించింది. తాజాగా ఆ గడువూ తీరిపోవడంతో మరోసారి జులై 11వ తేదీ వరకూ పొడిగిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. దీంతో మిగిలిపోయినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మరింత సమయం లభించింది. ఇదే చివరి అవకాశమని, 15 రోజుల గడువిచ్చామని ఈపీఎఫ్‌వో వెల్లడించింది. అర్హులైన వారికి అధిక పింఛను ఇవ్వాల్సిందేనని 2022 నవంబరు 4వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈపీఎఫ్‌వో ఈ దరఖాస్తులను స్వీకరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని