నౌకాదళ రఫేల్‌ జెట్ల కొనుగోలుకు భారత్‌ నిర్ణయం

భారత నౌకాదళం కోసం రఫేల్‌ (మెరైన్‌) యుద్ధవిమానాలను ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు ఫ్రాన్స్‌కు చెందిన ఏరోస్పేస్‌ దిగ్గజం దసో ఏవియేషన్‌ శనివారం పేర్కొంది.

Published : 16 Jul 2023 04:57 IST

దసో ఏవియేషన్‌ వెల్లడి

దిల్లీ: భారత నౌకాదళం కోసం రఫేల్‌ (మెరైన్‌) యుద్ధవిమానాలను ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు ఫ్రాన్స్‌కు చెందిన ఏరోస్పేస్‌ దిగ్గజం దసో ఏవియేషన్‌ శనివారం పేర్కొంది. వీటిని భారత్‌లో నిశితంగా పరీక్షించాకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించింది. ఆ జెట్‌లు పూర్తిగా భారత నౌకాదళ అవసరాలకు సరిపోతాయని తెలిపింది. ఫ్రాన్స్‌ నుంచి రఫేల్‌ (మెరైన్‌) జెట్‌ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వశాఖ గురువారం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు