chandrayaan 3: చంద్రుడి వనరులపై హక్కులు ఎవరివి?

చందమామపై ప్రపంచ దేశాల ఆసక్తి పెరిగి, వరుసగా వ్యోమనౌకలను పంపుతున్న నేపథ్యంలో.. ఆ ఖగోళ వస్తువు, అక్కడి వనరులపై హక్కులు ఎవరివి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Updated : 24 Aug 2023 10:01 IST

చందమామపై ప్రపంచ దేశాల ఆసక్తి పెరిగి, వరుసగా వ్యోమనౌకలను పంపుతున్న నేపథ్యంలో.. ఆ ఖగోళ వస్తువు, అక్కడి వనరులపై హక్కులు ఎవరివి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై అంతర్జాతీయ చట్టాలు స్పష్టంగా ఉన్నాయి.  జాబిల్లి మానవాళి మొత్తానిది.

  • అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి 1966లో ఐరాస.. ఔటర్‌ స్పేస్‌ ట్రీటీని తీసుకొచ్చింది. దీని ప్రకారం చందమామ, ఇతర ఖగోళ వస్తువులపై ఏ దేశమూ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోకూడదు. అన్ని దేశాల ప్రయోజనం కోసం ఖగోళ అన్వేషణ జరగాలి. అయితే ఈ ఒప్పందంలో ప్రభుత్వాల ప్రస్తావనే ఉంది. చందమామలోని ఏదైనా ప్రాంతంపై హక్కులను ప్రకటించుకోవచ్చా అన్నదానిపై స్పష్టతలేదు.
  • ఈ నేపథ్యంలో 1979లో మూన్‌ అగ్రిమెంట్‌ తెరపైకి వచ్చింది. దీని ప్రకారం ఏ ప్రభుత్వ, అంతర్జాతీయ, ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు చందమామను తమ ఆస్తిగా ప్రకటించుకోకూడదు. అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని, జాబిల్లి మాదే అనడం చెల్లదు. చందమామ, అక్కడి సహజవనరులు మానవాళి ఉమ్మడి సొత్తు. ఈ ఒప్పందం 1984లో అమల్లోకి వచ్చింది. అయితే చందమామపైకి ల్యాండర్లు పంపిన అమెరికా, రష్యా, చైనా మాత్రం ఇంకా ఈ ఒప్పందాన్ని ఆమోదించలేదు.
  • అంతరిక్ష ఒప్పందానికి కొనసాగింపుగా అమెరికా 2020లో అర్టెమిస్‌ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. చందమామపై సురక్షితంగా ప్రయోగాలు చేపట్టడం దీని ఉద్దేశం. ఇందులో కెనడా, జపాన్‌, ఐరోపా తదితర దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. భారత్‌ కూడా ఇటీవల ఇందులో చేరింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు