పంజాబ్‌లో పన్నూ ఆస్తుల జప్తు

కెనడాలోని భారతీయులను బెదిరించిన నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్జీఎఫ్‌) నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై భారత్‌ కన్నెర్ర చేసింది.

Published : 24 Sep 2023 04:37 IST

దిల్లీ: కెనడాలోని భారతీయులను బెదిరించిన నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్జీఎఫ్‌) నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై భారత్‌ కన్నెర్ర చేసింది. పంజాబ్‌లోని ఆ వేర్పాటువాద నేత ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం జప్తు చేసింది. ఖలిస్థాన్‌ మద్దతుదారుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య అంశంపై కెనడాతో వివాదం రగులుతున్నవేళ.. సామాజిక మాధ్యమాల్లో హిందువులపై పన్నూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. కెనడా విడిచి వెళ్లాల్సిందిగా వారికి హెచ్చరికలు జారీ చేశాడు. మరో వీడియోలో కెనడాలోని భారత దౌత్య సిబ్బందిని కూడా బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. అమృత్‌సర్‌ శివారులోని పన్నూ పూర్వీకుల గ్రామమైన ఖాన్‌కోట్‌లో అతనికి ఉన్న 5.7 ఎకరాల భూమిని, చండీగఢ్‌లోని నివాసాన్ని స్వాధీనం చేసుకుంది. కెనడాలో నివసిస్తున్న పన్నూపై పంజాబ్‌, ఇతరప్రాంతాల్లో 12 కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని