పురుషుడిలా మారిపోతా.. అనుమతివ్వండి

ఓ మహిళా కానిస్టేబుల్‌ తాను పురుషుడిగా మారిపోయేందుకు లింగమార్పిడికి అనుమతించాలంటూ చేసుకున్న విజ్ఞప్తి ఉత్తర్‌ప్రదేశ్‌ డీజీపీ కార్యాలయాన్ని విస్మయానికి గురిచేసింది.

Published : 24 Sep 2023 04:37 IST

యూపీలో మహిళా కానిస్టేబుల్‌ వినతి

గోరఖ్‌పుర్‌: ఓ మహిళా కానిస్టేబుల్‌ తాను పురుషుడిగా మారిపోయేందుకు లింగమార్పిడికి అనుమతించాలంటూ చేసుకున్న విజ్ఞప్తి ఉత్తర్‌ప్రదేశ్‌ డీజీపీ కార్యాలయాన్ని విస్మయానికి గురిచేసింది. అయోధ్యకు చెందిన ఆ మహిళా కానిస్టేబుల్‌ 2019లో విధుల్లో చేరారు. ప్రస్తుతం గోరఖ్‌పుర్‌లోని స్థానిక నిఘా విభాగంలో పనిచేస్తున్నారు. ఆమె ప్యాంట్‌, చొక్కా ధరించి.. పురుషుడిలా జుట్టు కత్తిరించుకుని ఆఫీసుకు వెళ్లేవారు. క్రికెట్‌ ఆడేవారు. తనకు విద్యార్థి దశ నుంచే లింగ అసంతృప్తి ఉండేదని అమె చెబుతున్నారు. పోలీసు శాఖలో చేరాక లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో దిల్లీలోని వైద్యులను సంప్రదించారు. అనంతరం తాను పురుషుడిగా మారేందుకు అనుమతించాలంటూ డీజీపీకి లేఖ రాశారు. అనుమతి నిరాకరిస్తే కోర్టును ఆశ్రయించడానికి కూడా వెనకాడనంటున్నారు. ఈ విషయంపై స్పందించిన డీజీపీ కార్యాలయం.. గోరఖ్‌పుర్‌ పోలీసులకు ఓ లేఖ రాసిందని సమాచారం. అందులో ఆ మహిళా కానిస్టేబుల్‌కు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని