ఖలిస్థానీ గ్రూపుల నుంచి ఆమ్‌ఆద్మీకి రూ.133 కోట్లు: పన్నూ

అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి 2014-22 మధ్య ఖలిస్థానీ గ్రూపుల నుంచి 1.6 కోట్ల డాలర్ల మేర (సుమారు రూ.133.48 కోట్లు) డబ్బులు అందాయని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ వెల్లడించాడు.

Published : 26 Mar 2024 05:43 IST

దిల్లీ: అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి 2014-22 మధ్య ఖలిస్థానీ గ్రూపుల నుంచి 1.6 కోట్ల డాలర్ల మేర (సుమారు రూ.133.48 కోట్లు) డబ్బులు అందాయని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ వెల్లడించాడు. డబ్బు ముట్టజెప్పినట్లయితే ఉగ్రవాది దేవీందర్‌ పల్‌సింగ్‌ భుల్లర్‌ను జైలు నుంచి విడుదల చేస్తానని 2014లో కేజ్రీవాల్‌ (దిల్లీ ముఖ్యమంత్రి) ప్రతిపాదించినట్లు ఆరోపించాడు. ఖలిస్థాన్‌ అనుకూల సిక్కులతో న్యూయార్క్‌లోని రిచ్‌మండ్‌ హిల్‌లో ఒక గురుద్వారాలో జరిగిన సమావేశంలో ఈ హామీ లభించినట్లు తెలిపాడు. 1993 నాటి దిల్లీ బాంబుపేలుడు కేసులో భుల్లర్‌ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఆప్‌ నేత కేజ్రీవాల్‌పై ఆరోపణలతో పన్నూ రూపొందించిన వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చింది. గతంలోనూ కేజ్రీవాల్‌పై పన్నూ ఆరోపణలు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని