2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు

జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.

Published : 27 Apr 2024 04:33 IST

విధివిధానాలపై సీబీఎస్‌ఈని కసరత్తు ప్రారంభించాలన్న కేంద్రం

దిల్లీ: జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. సెమిస్టర్‌ విధానాన్ని పాటించకుండా, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై కసరత్తులు ప్రారంభించాలని కేంద్ర విద్యాశాఖ సీబీఎస్‌ఈని కోరింది. దీంతో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) ప్రవేశాలపై ప్రభావం పడకుండా నూతన విద్యా క్యాలెండర్‌ను రూపొందించే పనిలో సీబీఎస్‌ఈ నిమగ్నమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అంతేకాకుండా రెండుసార్లు పరీక్షలు నిర్వహించే అంశంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులతో విద్యాశాఖ, సీబీఎస్‌ఈ ప్రతినిధులు వచ్చే నెలలో సంప్రదింపులు జరపనున్నట్లు వెల్లడించారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచే ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని గతేడాది కేంద్ర విద్యాశాఖ ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని