ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్‌

స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్‌ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది.

Published : 05 May 2024 04:48 IST

లఖ్‌నవూ: స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్‌ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆగ్రా సమీప సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూలు టీచరు గుంజన్‌ చౌదరి తరచూ పాఠశాలకు ఆలస్యంగా వస్తుండటంతో ప్రిన్సిపల్‌ ఆమెతో వాదనకు దిగారు. టీచరు ఎదురుతిరిగి జవాబు ఇవ్వడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రిన్సిపల్‌ ఏకంగా భౌతికదాడికి దిగి, ఆమె దుస్తులను చింపేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనను మరో టీచరు వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. ప్రిన్సిపల్‌పై టీచరు పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని