25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్‌ దౌత్యవేత్త

భారత్‌లోని అఫ్గానిస్థాన్‌ సీనియర్‌ దౌత్యవేత్త జకియా వార్ధక్‌ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులకు పట్టుబడ్డారు.

Published : 05 May 2024 04:49 IST

జకియా వార్ధక్‌ రాజీనామా

దిల్లీ: భారత్‌లోని అఫ్గానిస్థాన్‌ సీనియర్‌ దౌత్యవేత్త జకియా వార్ధక్‌ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులకు పట్టుబడ్డారు. దాదాపు రూ.18.6 కోట్ల విలువైన ఈ బంగారాన్ని ఆమె దుబాయ్‌ నుంచి భారత్‌కు తన వస్త్రాల్లో తరలించారని.. తనిఖీల్లో ఈ విషయం బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. దౌత్యపరమైన మినహాయింపు కారణంగా ఆమెను అదుపులోకి తీసుకోలేదని డీఆర్‌ఐ తెలిపింది. గత నెల 25న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జకియా వార్ధక్‌ శనివారం  ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని