దిల్లీలో హింస నేపథ్యంలో 550 ట్విటర్‌ ఖాతాల తొలగింపు

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో దాదాపు 550 ఖాతాలను ట్విటర్‌ తొలగించింది. బుధవారం ఈ విషయాన్ని ట్విటర్‌ అధికార ప్రతినిధి

Published : 28 Jan 2021 04:36 IST

దిల్లీ: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో దాదాపు 550 ఖాతాలను ట్విటర్‌ తొలగించింది. బుధవారం ఈ విషయాన్ని ట్విటర్‌ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారటం, తదనంతర పరిణామాలపై అసంబద్ధ సందేశాలతో ట్విటర్‌ వేదికను దుర్వినియోగపరచిన వినియోగదారులపై ఈ చర్య తీసుకొన్నట్టు తెలిపారు. ‘మేము గట్టి వైఖరినే తీసుకున్నాం. అసంబద్ధ సందేశాలు, విద్వేష ప్రసంగాలు, బెదిరింపులు ఉద్రిక్తతలు పెంచుతాయి. కాబట్టి, మా వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించినవారి ఖాతాలు తొలగించాం’ అని వివరించారు. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంలోనూ ఇలాగే వ్యవహరించినట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని