టీకా వేగం పెంచకపోతే మూడోదశ ముప్పు

కరోనా నియంత్రణకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయకపోతే దేశంలో మరో 6-8 నెలల్లో మహమ్మారి మూడోదశ

Published : 20 May 2021 05:27 IST

శాస్త్రవేత్త విద్యాసాగర్‌ హెచ్చరిక

దిల్లీ: కరోనా నియంత్రణకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయకపోతే దేశంలో మరో 6-8 నెలల్లో మహమ్మారి మూడోదశ వ్యాప్తికి అవకాశం ఉందని శాస్త్రవేత్త ఎం.విద్యాసాగర్‌ హెచ్చరించారు. గణితశాస్త్ర సాయంతో సూత్ర మోడల్‌ ద్వారా కొవిడ్‌-19 విక్షేపమార్గాన్ని ఆవిష్కరించడంలో ఈయన పాత్ర ఉంది. ఐఐటీ- హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ అయిన విద్యాసాగర్‌ ఇటాలియన్‌ పరిశోధకులు కొవిడ్‌ బాధితులపై జరిపిన పరిశోధన తాలూకు పత్రాల ఆధారంగా మాట్లాడుతూ..‘మనిషి దేహంలో యాంటీబాడీలు తగ్గిపోతే రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకోకపోతే 6-8 నెలల్లో మూడోముప్పు ఉంటుంది’ అని విశ్లేషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని