Corona: ఆమె శరీరంలో 32 రకాల మ్యుటేషన్స్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఒక్కో దేశంలో ఒక్కో రూపంలో విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతూ కొత్త రూపును సంతరించుకుంటోంది.
దక్షిణాఫ్రికాలో గుర్తించిన పరిశోధకులు
దిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఒక్కో దేశంలో ఒక్కో రూపంలో విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతూ కొత్త రూపును సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని ఓ మహిళ శరీరంలో కరోనా వైరస్ తీవ్రంగా మారడాన్ని (మ్యుటేషన్స్ చెందడాన్ని) గుర్తించారు. 36ఏళ్ల ఆ మహిళ హెచ్‌ఐవీతో బాధపడుతుండగా, 216 రోజుల నుంచి కరోనా వైరస్‌తో పోరాడుతోంది. కరోనా సోకిన రోజు నుంచి ఆమె శరీరంలో దాదాపు 30కిపైగా రకాలుగా కరోనా ఉత్పరివర్తనం చెందినట్లు పరిశోధకులు గుర్తించారు. మెడికల్ జర్నల్ మెడ్రిక్స్‌వి ఈ అసాధారణ కేసుకు సంబంధించిన వివరాలను ప్రచురించింది. అయితే, దీనిపై ఇప్పటివరకూ పునఃపరిశీలన జరపలేదు. సదరు మహిళ 2006లో హెచ్‌ఐవీ బారిన పడింది. క్రమంగా రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తూ వచ్చింది. గతేడాది సెప్టెంబరులో కరోనా బారిన పడింది. అప్పటి నుంచి ఆమెలో కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్ 13 రకాలుగా ఉత్పరివర్తనం చెందగా, జన్యుపరంగా 19 రకాలుగా రూపాంతరం చెందింది. E484K, B.1.1.7, N510Y, B.1.351 ఇలా ఆమె శరీరంలో పలు రకాలుగా కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెందడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఐవీ బారిన పడిన వారు కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాదు, తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TSPSC: రాజశేఖర్ ఇంట్లో మరికొన్ని ప్రశ్నపత్రాలు.. నాలుగో రోజు విచారణలో కీలక ఆధారాలు
-
General News
Ap Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
rangamarthanda review: రివ్యూ: రంగమార్తాండ
-
Sports News
Sachin - Sehwag: ముల్తాన్ టెస్టులో సిక్స్ కొడతానంటే.. సచిన్ అలా అనేశాడు: సెహ్వాగ్
-
World News
Medvedev: క్షిపణి రావొచ్చు.. ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి: ఐసీసీకి మెద్వదేవ్ వార్నింగ్
-
Movies News
Brahmanandam: చనిపోయే వరకూ కమెడియన్‌గానే ఉంటా: బ్రహ్మానందం