Remdesivir: పిల్లలకు రెమ్‌డెసివిర్ వద్దు
చిన్నపిల్లలు కొవిడ్ బారిన పడితే ఏ విధంగా చికిత్సలు అందించాలనే విషయమై కేంద్రప్రభుత్వం సవివరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్....
స్వల్ప లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్పించవద్దు
కేంద్రం మార్గదర్శకాలు
దిల్లీ: చిన్నపిల్లలు కొవిడ్ బారిన పడితే ఏ విధంగా చికిత్సలు అందించాలనే విషయమై కేంద్రప్రభుత్వం సవివరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) వీటిని పంపించింది. దీని ప్రకారం...
* కరోనాకు గురైన 18 ఏళ్లలోపు పిల్లల ఊపిరితిత్తుల పరిస్థితులను తెలుసుకోవడానికి హై రిజల్యూషన్ సి.టి.స్కాన్‌ను అంతగా వినియోగించాల్సిన పనిలేదు. ఈ సౌకర్యాన్ని హేతుబద్ధంగా ఉపయోగించాలి.
* అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకూడదు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారికే స్టెరాయిడ్స్ ఇవ్వాలి.
* వైరస్ లక్షణాలు బహిర్గతం కాకపోయినా, తక్కువగా కనిపించినా యాంటీ మైక్రోబయల్స్ మందులు ఉపయోగించకూడదు.
* ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సిన పనిలేదు. ఒకవేళ చేర్పిస్తే వారికి ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది.
* పిల్లలకు ప్రత్యేకమైన మందులు అంటూ ఏమీ లేవు. జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపించినప్పుడు పారాసిటమాల్ మాత్రలు ఇవ్వవచ్చు. అయితే మాస్కు ధరించడం, దూరాన్ని పాటించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.
* వ్యాధి తీవ్రత ఒకస్థాయిలో ఉన్నప్పుడు తక్షణమే ఆక్సిజన్ థెరఫీ ప్రారంభించాలి. ఇన్‌హేలర్ వంటివి వాడకూడదు. రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
World News
Viral News: ఒక్కో ఉద్యోగికి ₹6 కోట్లు బోనస్.. కట్టలుకట్టలుగా పంచిన చైనా కంపెనీ!