వేగంగా కోలుకుంటున్న అమెరికా

అమెరికా సంస్థల్లో ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. దేశ వ్యాప్తంగా ఒక్క జులైలోనే 9,43,000 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో నిరుద్యోగిత రేటు 5 పాయింట్లు తగ్గింది.

Published : 07 Aug 2021 05:14 IST

జులైలో కొత్తగా 9.43 లక్షల ఉద్యోగాలు!

5 పాయింట్లు తగ్గిన నిరుద్యోగిత రేటు

వాషింగ్టన్‌: అమెరికా సంస్థల్లో ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. దేశ వ్యాప్తంగా ఒక్క జులైలోనే 9,43,000 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో నిరుద్యోగిత రేటు 5 పాయింట్లు తగ్గింది. కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందని చెప్పడానికి ఇదో సంకేతమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి- జులైలో 8.6 లక్షల వరకూ కొత్త కొలువులు ఉండవచ్చని నిపుణులు అంచనా వేశారు. అయితే అంతకుమించి నియామకాలు చేపడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవడంతో ఈ రంగంలో 3.27 లక్షల ఉద్యోగాలు; పాఠశాలల్లో మరో 2.21 లక్షల కొలువులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో జూన్‌లో 5.9% ఉన్న నిరుద్యోగిత రేటు జులైలో 5.4 శాతానికి పడిపోయింది.

* వ్యాపారాలు ఊపందుకోవడంతో నియామకాలతో పాటు వేతనాలు కూడా పెరిగాయి. సగటున 4% మేర జీతాలు పెంచారు.

* కరోనా ఉద్ధృతి కారణంగా వ్యాపారాలు మూతపడటంతో గత ఏడాది మార్చి-ఏప్రిల్‌ మధ్య సుమారు 2.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. తర్వాత క్రమంగా 1.7 కోట్ల మందికి కొలువులు దక్కాయి. అమెరికా ఆర్థిక, ఉద్యోగ రంగ పరిస్థితులు వేగంగా, సరైన విధానంలో కుదురుకుంటున్నాయని బ్యాంక్‌రేట్‌.కామ్‌ ప్రధాన విశ్లేషకుడు గ్రెగ్‌ మెక్‌బ్రైడ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని