కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న మహిళ మృతి!

న్యూజిలాండ్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ దుష్ప్రభావాల కారణంగా ఓ మహిళ మరణించింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆ మహిళ గుండె కండరాలు తీవ్రంగా నొప్పిపెట్టాయి.

Published : 31 Aug 2021 04:45 IST

న్యూజిలాండ్‌లో తొలిసారి నమోదు

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ దుష్ప్రభావాల కారణంగా ఓ మహిళ మరణించింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆ మహిళ గుండె కండరాలు తీవ్రంగా నొప్పిపెట్టాయి. దీంతో ఆమె కన్ను మూసింది. ఆమెకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, వాటికి వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలు తోడు కావడం వల్లే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ఆరోగ్య విభాగం అధికారులు చెప్పారు. ఈ ఘటనపై ఆరోగ్య విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఆశ్లే బ్లూమ్‌ఫీల్డ్‌ సోమవారం మాట్లాడుతూ... కొవిడ్‌ వ్యాక్సిన్‌ అత్యంత సురక్షితమైనదని, దీని కారణంగా మ్యొకార్డిటిస్‌ (గుండె కండరాలు నొప్పి పెట్టడం) చాలా అరుదని, న్యూజిలాండ్‌లో ఇప్పటివరకూ 20 లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపారు. మృతిచెందిన మహిళ వయసు ఎంత? ఎప్పుడు చనిపోయింది? అన్న వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. న్యూజిలాండ్‌లో ప్రస్తుతం డెల్టా రకం కరోనా వైరస్‌ వ్యాపిస్తోంది. దీంతో ఆక్లాండ్‌లో కనీసం మరో రెండు వారాలపాటు కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగుతాయని న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని