Corona virus: 16 ఏళ్ల లోపు పిల్లలకు బాల్‌ రక్ష

కొవిడ్‌ మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉందన్న అంచనాల నేపథ్యంలో అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ) పిల్లల కోసం ఓ కిట్‌ను రూపొందించింది. 16 ఏళ్ల లోపు వయసున్నవారికి ఉద్దేశించి.. రోగనిరోధక శక్తిని

Published : 01 Oct 2021 09:08 IST

రోగనిరోధక శక్తికి ఆయుర్వేద కిట్‌

దిల్లీ: కొవిడ్‌ మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉందన్న అంచనాల నేపథ్యంలో అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ) పిల్లల కోసం ఓ కిట్‌ను రూపొందించింది. 16 ఏళ్ల లోపు వయసున్నవారికి ఉద్దేశించి.. రోగనిరోధక శక్తిని పెంచే ‘బాల్‌ రక్షా కిట్‌’ను అభివృద్ధి చేసింది. కేంద్ర ఆయుష్‌ శాఖ పరిధిలో ఏఐఐఏ పనిచేస్తోంది. ఈ కిట్‌ కొవిడ్‌ కారక కరోనా వైరస్‌పై పోరాడేందుకు, పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుందని ఆయుష్‌ శాఖ అధికారులు తెలిపారు. ఇంతవరకు పిల్లలకు కొవిడ్‌ టీకా రాని నేపథ్యంలో వారి ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించి ఈ కిట్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. కిట్‌లో భాగంగా.. తులసి, తిప్పతీగ, దాల్చిన చెక్క, లికొరైస్‌ (యష్టిమధుకం), ఎండు ద్రాక్షలతో తయారు చేసిన సిరప్‌తోపాటు అన్ను ఆయిల్‌, సీతోపలాది, చ్యవన్‌ప్రాశ్‌లు ఉంటాయని వెల్లడించారు. ఈ సిరప్‌లో అద్భుత ఔషధ గుణాలున్నట్లు తెలిపారు. ఆయుష్‌ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలకు అనుగుణగా ఈ కిట్‌ను రూపొందించారని.. దీన్ని ప్రభుత్వ రంగ సంస్థ ‘ఇండియన్‌ మెడిసిన్స్‌ ఫార్మాస్యుటికల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఎంపీసీఎల్‌) తయారు చేసినట్లు చెప్పారు. నవంబరు 2న జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఏఐఐఏ 10 వేల కిట్లను ఉచితంగా పంపిణీ చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని