వీసా జారీలో జాప్యం తప్పదు
వలసేతర (నాన్ ఇమ్మిగ్రెంట్) విభాగాల్లో వీసా అపాయింట్‌మెంట్/జారీ ప్రక్రియల కోసం.. సాధారణంతో పోలిస్తే ప్రస్తుతం కొంత ఎక్కువ సమయం ఎదురుచూడక తప్పదని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. కొవిడ్ మహమ్మారితో
కొవిడ్ పరిస్థితులే కారణమన్న అమెరికా రాయబార కార్యాలయం
దిల్లీ: వలసేతర (నాన్ ఇమ్మిగ్రెంట్) విభాగాల్లో వీసా అపాయింట్‌మెంట్/జారీ ప్రక్రియల కోసం.. సాధారణంతో పోలిస్తే ప్రస్తుతం కొంత ఎక్కువ సమయం ఎదురుచూడక తప్పదని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. కొవిడ్ మహమ్మారితో ఏర్పడిన అవాంతరాల నుంచి కోలుకొని పరిస్థితులు ఇప్పుడిప్పుడే తిరిగి పట్టాలెక్కుతుండటమే అందుకు కారణమని తెలిపింది. నూతన అంతర్జాతీయ విమానయాన విధానం ప్రకారం భారత్ నుంచి దాదాపు 30 లక్షల మంది వీసాదారులు ఈ నెల 8 నుంచి అమెరికాకు వెళ్లేందుకు అవకాశాలున్నాయని వెల్లడించింది. కొవిడ్ టీకా తీసుకున్నట్లు ప్రయాణానికి ముందు వారు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కొవిషీల్డ్‌కు అత్యవసర వినియోగ అనుమతి దక్కిన నేపథ్యంలో.. ఆ టీకా వేసుకున్నవారినీ ప్రయాణానికి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nikki Haley: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. జాగ్రత్త : నిక్కీహేలీ కీలక వ్యాఖ్యలు
-
Mynampally: మల్కాజిగిరి నుంచే పోటీ.. కార్యకర్తల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే: మైనంపల్లి
-
TSPSC: టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను తొలగించాలి.. ఓయూలో విద్యార్థుల ఆందోళన
-
Vande bharat express: కాచిగూడ- యశ్వంత్‌పూర్, చెన్నై- విజయవాడ టికెట్ ధరలివే..!
-
High Speed Train: ఆరు నెలల్లో హైస్పీడ్ ట్రైన్.. వెల్లడించిన రైల్వే మంత్రి
-
Vizag: గోనెసంచిలో చుట్టి సముద్రంలో పడేసి.. విశాఖలో బాలుడి హత్య