క్రిస్మస్‌ ఊరేగింపుపై దూసుకెళ్లిన కారు

క్రిస్మస్‌ పండుగ రాబోతున్న నేపథ్యంలో ముందస్తు ఉత్సవాలు నిర్వహించుకుంటున్నవారిపైకి అనూహ్యంగా ఒక కారు (ఎస్‌యూవీ) దూసుకుపోయిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు.

Published : 23 Nov 2021 04:49 IST

 ఐదుగురి మృతి..40 మందికి గాయాలు

అమెరికాలో దుర్ఘటన

కారు దూసుకుపోయిన అనంతరం ఘటనా ప్రాంతం. అంతరచిత్రంలో అంతకుముందు జనంపైకి వేగంగా వెళ్తున్న కారు.

వాషింగ్టన్‌: క్రిస్మస్‌ పండుగ రాబోతున్న నేపథ్యంలో ముందస్తు ఉత్సవాలు నిర్వహించుకుంటున్నవారిపైకి అనూహ్యంగా ఒక కారు (ఎస్‌యూవీ) దూసుకుపోయిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. అమెరికాలోని విస్కాన్సిన్‌లో ఉన్న వౌకేషా నగరంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వీనుల విందైన వాయిద్యాల నడుమ శాంతాక్లాజ్‌ తరహాలో టోపీలు ధరించి ప్రజలంతా ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు వారిపైకి కారు వేగంగా దూసుకువచ్చింది. బ్యారికేడ్లను ఢీకొట్టి, ఆ తర్వాత ప్రజలపైకి ఇది వచ్చినట్లు వీడియోల్లో నమోదైంది. అనుమానితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వాహనం అక్కడి బ్యారికేడ్లను ఢీకొన్నప్పుడు కాల్పుల మాదిరి శబ్దం వినిపించిందని, డ్రైవరును నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంతవరకు ఆనందోత్సాహాలు, పిల్లల కేరింతలతో కళకళలాడిన ప్రాంతంలో ఒక్కసారిగా భీతావహ పరిస్థితి నెలకొందని వివరించారు. కారును నడిపిన వ్యక్తి ఏదైనా నేరానికి పాల్పడి పరారైపోయే ప్రయత్నంలో ప్రజల మీదికి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని