Krishna Ella: కృష్ణ ఎల్లకు అమిటీ వర్సిటీ గౌరవ డాక్టరేట్‌

అనేక మెట్రో నగరాల్లో విస్తరించిన ప్రాంగణాలతో పేరొందిన అమిటీ యూనివర్సిటీ శనివారం ఇక్కడి నోయిడా క్యాంపస్‌లో జరిగిన స్నాతకోత్సవంలో భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

Updated : 19 Dec 2021 09:19 IST

వ్యాక్సిన్‌ రంగంలో విశేష కృషికి గుర్తింపు

అమిటీ యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ అతుల్‌ చౌహాన్‌, వ్యవస్థాపక అధ్యక్షుడు అశోక్‌ కె.చౌహాన్‌

చేతులమీదుగా గౌరవ డాక్టరేట్‌ అందుకుంటున్న భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల

ఈనాడు, దిల్లీ: అనేక మెట్రో నగరాల్లో విస్తరించిన ప్రాంగణాలతో పేరొందిన అమిటీ యూనివర్సిటీ శనివారం ఇక్కడి నోయిడా క్యాంపస్‌లో జరిగిన స్నాతకోత్సవంలో భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. వర్శిటీ ఉత్తర్‌ప్రదేశ్‌ ఛాన్స్‌లర్‌ అతుల్‌ చౌహాన్‌, ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అశోక్‌ కె.చౌహాన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నార్తర్న్‌ ఐర్లాండ్‌ క్యూన్స్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌, వైస్‌ఛాన్స్‌లర్‌ అయిన ప్రొఫెసర్‌ ఇయాన్‌ గ్రీర్‌, భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లకు గౌరవ డాక్టరేట్లు అందించి గౌరవించారు. వ్యాక్సిన్‌ రంగంలో కృష్ణ ఎల్ల చేస్తున్న విశేషసేవలకు గుర్తింపుగా ఈ డాక్టరేట్‌ అందజేశారు. నవంబరు 25న కర్ణాటక అగ్రికల్చర్‌, హార్టికల్చరల్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ 6వ స్నాతకోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్‌ తావర్‌చంద్‌ గహ్లోత్‌ కృష్ణ ఎల్లకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. నెల తిరక్కముందే ఈయనకు మరో డాక్టరేట్‌ లభించింది.

వియత్నాం ఆరోగ్యమంత్రితో భేటీ

భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర శనివారం ఇక్కడ వియత్నాం ఆరోగ్యమంత్రి డాక్టర్‌ త్రాన్‌వాన్‌ తువాన్‌తో సమావేశమయ్యారు. వియత్నాంలో 18 ఏళ్లలోపు పిల్లలకు కొవాగ్జిన్‌ అందించే విషయంపై చర్చించారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన నాసల్‌ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను వియత్నాంలో నిర్వహించడంపై సమాలోచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని