Corona Virus: ఫిబ్రవరి ఆరంభంలో గరిష్ఠస్థాయికి మూడో ఉద్ధృతి

వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 కల్లా భారత్‌లో కరోనా మూడో ఉద్ధృతి గరిష్ఠసాయికి చేరొచ్చని ఐఐటీ కాన్పుర్‌కు చెందిన అధ్యయనకర్తలు పేర్కొన్నారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్‌ వ్యాప్తితో కేసులు పెరుగుతున్న

Updated : 25 Dec 2021 07:30 IST

ఐఐటీ అధ్యయనకర్తల అంచనా

దిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 కల్లా భారత్‌లో కరోనా మూడో ఉద్ధృతి గరిష్ఠసాయికి చేరొచ్చని ఐఐటీ కాన్పుర్‌కు చెందిన అధ్యయనకర్తలు పేర్కొన్నారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్‌ వ్యాప్తితో కేసులు పెరుగుతున్న తరహాలోనే భారత్‌లోనూ మహమ్మారి విస్తరిస్తుందన్న భావన ఆధారంగా ఓ నమూనా అధ్యయనాన్ని చేపట్టి ఈ అంచనాకు వచ్చారు. ఇందుకోసం గౌస్సియన్‌ మిక్సర్‌ మోడల్‌ అనే గణాంక విధానాన్ని అనుసరించారు. ఇప్పటికే మూడో ఉద్ధృతి కొనసాగుతున్న అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, రష్యా లాంటి దేశాల్లో రోజువారీ కేసుల పరిణామక్రమాన్ని విశ్లేషించి, దీని ఆధారంగా భారత్‌లో కాలక్రమేణా పెరగనున్న తీవ్రతను అంచనా వేశారు. భారత్‌లో మొదటి, రెండో ఉద్ధృతి సమయాల్లో చోటుచేసుకున్న కేసుల పెరుగుదలనూ పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం డిసెంబరు 15 నుంచి కేసులు పెరుగుతాయని, వచ్చే ఫిబ్రవరి 3కు మూదో ఉద్ధృతి అత్యంత తీవ్రరూపుదాల్చుతుందని వెల్లడించారు. అయితే దేశంలో వ్యాక్సినేషన్‌ శైలిని ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకోలేదని, అందువల్ల గరిష్ఠస్థాయికి చేరినప్పుడు రోజువారీ కేసుల సంఖ్య ఎంత ఉండొచ్చన్నది చెప్పలేమని పేర్కొన్నారు. భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో 100 శాతం సమర్థతను పొందాలంటే ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని