Milk: చందమామ రావే! పాలబువ్వ తినవే

పాలు తాగనని మారాం చేసే పిల్లల్ని తల్లులు బతిమిలాడినట్లు జపాన్‌ ప్రభుత్వం ఆ దేశ ప్రజలను పాలు తాగమని ప్రాధేయపడుతోంది.

Updated : 29 Dec 2021 09:11 IST

పాల వాడకం పెంచమని కోరుతున్న జపాన్‌ సర్కారు

టోక్యో: పాలు తాగనని మారాం చేసే పిల్లల్ని తల్లులు బతిమిలాడినట్లు జపాన్‌ ప్రభుత్వం ఆ దేశ ప్రజలను పాలు తాగమని ప్రాధేయపడుతోంది. ప్రతిరోజు ఇంట్లో వినియోగించే పాల కంటే ఇంకాస్త ఎక్కువ కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం జపాన్‌లో డిమాండుకు మించి పాలు ఉత్పత్తి అవుతుండటమే దీనిక్కారణం. కొన్నేళ్ల కిందట జపాన్‌లో వెన్నకు కొరత ఏర్పడటంతో దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహించింది. ఫలితంగా పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కొవిడ్‌ కారణంగా విద్యాసంస్థలు, రెస్టారెంట్లు మూతపడి.. పాల వినియోగం తగ్గిపోయింది. ఎంత నిల్వ చేసినా.. పాలు ఎక్కువ రోజులు ఉండవు. ఈ ఏడాది చివరినాటికి జపాన్‌లో పాల వృథా భారీగా ఉండనుందని అంచనా. ఈ నేపథ్యంలోనే రోజూ గ్లాసు పాలు తాగే ప్రజలు కొన్నాళ్లపాటు రెండు గ్లాసులు తాగాలని, వంటల్లోనూ పాలు వాడాలని జపాన్‌ ప్రభుత్వం కోరుతోంది. అప్పుడే పాడి పరిశ్రమను కాపాడుకోగలమని చెబుతోంది. మరోవైపు.. వరదలతో జపాన్‌లో బంగాళదుంపల కొరత ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని