భిక్షాటనతో మనవరాలిని కిక్‌ బాక్సర్‌ను చేసిన హిజ్రా

కృషి, పట్టుదల... అంతకు మించిన సంకల్పం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఓ హిజ్రా నిరూపించారు. వరుసకు మనవరాలు అయిన బాలికను భిక్షాటన ద్వారా సేకరించిన మొత్తంతో కిక్‌ బాక్సర్‌గా...

Published : 10 Jan 2022 05:46 IST


కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించిన బీబీ ఫాతిమాతో షబానా, నిర్వాహకుడు

మైసూరు, న్యూస్‌టుడే: కృషి, పట్టుదల... అంతకు మించిన సంకల్పం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఓ హిజ్రా నిరూపించారు. వరుసకు మనవరాలు అయిన బాలికను భిక్షాటన ద్వారా సేకరించిన మొత్తంతో కిక్‌ బాక్సర్‌గా చేసిన ఘనత మైసూరుకు చెందిన అక్రం పాషా అలియాస్‌ షబానాదే. నగరంలోని సెయింట్‌ ఆంథోని ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బీబీ ఫాతిమా ఆసక్తిని గుర్తించిన షబానా... కిక్‌ బాక్సింగ్‌ శిక్షణ కోసం చేయూత ఇవ్వడం విశేషం. గతవారం మహారాష్ట్రలోని పుణెలో నిర్వహించిన వాకో ఇండియా నేషనల్‌ కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో బీబీ ఫాతిమా బంగారు పతకాన్ని సాధించింది. మైసూరు జిల్లా కిక్‌ బాక్సింగ్‌ సంస్థలో శిక్షణకు అవసరమైన ఆర్థిక వనరుల్నీ షబానా సమకూర్చారు. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించాలనే ఆశయంతో ఫాతిమా ఉన్నట్లు షబానా వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు