పురావస్తు పరిశోధకుడు నాగస్వామి కన్నుమూత

పురావస్తు, శిలాఫలకాల పరిశోధకుడు, తమిళనాడు పరిశోధక శాఖ మొట్టమొదటి సంచాలకుడు ఆర్‌.నాగస్వామి (91) అనారోగ్యంతో ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

Updated : 24 Jan 2022 05:06 IST

విల్లివాక్కం, న్యూస్‌టుడే: పురావస్తు, శిలాఫలకాల పరిశోధకుడు, తమిళనాడు పరిశోధక శాఖ మొట్టమొదటి సంచాలకుడు ఆర్‌.నాగస్వామి (91) అనారోగ్యంతో ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈయన 1930 ఆగస్టు 10న జన్మించారు. మద్రాసు వర్సిటీలో సంస్కృతంలో పీజీ చేశారు. పుణె వర్సిటీలో భారత కళలు, పురాతత్వ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలో డాక్టరేట్‌ పొందారు. భారత పురావస్తు పరిశోధన శాఖలో శిక్షణ పొందిన నాగస్వామి 1959 నుంచి 1963 వరకు చెన్నై ప్రభుత్వ మ్యూజియం సంరక్షకునిగా పనిచేశారు. 1963 నుంచి 1965 వరకు తమిళనాడు ప్రభుత్వ పురావస్తుశాఖ ప్రత్యేక సహాయ అధికారిగా, 1966 నుంచి 1988 వరకు పురావస్తుశాఖ మొదటి సంచాలకునిగా సేవలందించారు. పదవీవిరమణ తర్వాత కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖ సలహాదారుగా పనిచేశారు. శిలాఫలకాలు, కళలు, సంగీతం, నృత్యం, తమిళ చరిత్ర గురించి తమిళం, ఆంగ్లం, సంస్కృత భాషలలో పలు గ్రంథాలు రచించారు. ఈయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2018లో పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. నాగస్వామి మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు సంతాపం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని