గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌పై కాపీరైట్‌ ఉల్లంఘన కేసు

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ సహా సంస్థలోని మరో అయిదుగురు అధికారులపై కాపీరైట్‌ చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదు అయ్యింది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ‘ఏక్‌ హసీనా

Published : 27 Jan 2022 04:31 IST

ముంబయి: గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ సహా సంస్థలోని మరో అయిదుగురు అధికారులపై కాపీరైట్‌ చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదు అయ్యింది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ‘ఏక్‌ హసీనా తి ఏక్‌ దివానా థా’ సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులను గూగుల్‌ అనుమతించిందని ప్రముఖ దర్శకుడు సునీల్‌ దర్శన్‌ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని