ఆర్‌ఆర్‌బీ తీరుకు నిరసనగా నేడు బిహార్‌ బంద్‌

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) పరీక్షల నిర్వహణలో అస్తవ్యస్త విధానాలు అనుసరిస్తున్నారని నిరసన తెలుపుతూ శుక్రవారం బిహార్‌ బందుకు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాల మహాకూటమి ఈ బందుకు మద్దతు ప్రకటించింది.

Published : 28 Jan 2022 04:27 IST

మద్దతు తెలిపిన విపక్షాలు
రైల్వేశాఖ ‘వివరణ’

పట్నా, దిల్లీ, లఖ్‌నవూ: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) పరీక్షల నిర్వహణలో అస్తవ్యస్త విధానాలు అనుసరిస్తున్నారని నిరసన తెలుపుతూ శుక్రవారం బిహార్‌ బందుకు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాల మహాకూటమి ఈ బందుకు మద్దతు ప్రకటించింది. రైల్వే ఉద్యోగాల కోసం విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ దిల్లీలోని రైల్వే మంత్రిత్వశాఖ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టింది. రైల్వేమంత్రి అశ్విని వైభవ్‌ దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో రైల్వే పరీక్షలపై నిరసన తెలిపి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులను ఉద్దేశించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ మాట్లాడారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు. కాగా, విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన ఆరుగురు పోలీసులను ప్రభుత్వం తక్షణం సస్పెండు చేసింది.

* ఆర్‌ఆర్‌బీ పరీక్షల నిర్వహణలో విద్యార్థుల సందేహాలకు వివరణ ఇస్తూ రైల్వేశాఖ ఓ పత్రాన్ని విడుదల చేసింది. సమస్యల పరిష్కారానికి ఓ హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉద్యోగార్థులకు ఎటువంటి సందేహాలు, ఫిర్యాదులున్నా ఈ కమిటీకి పంపాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని