MK Stalin: స్టాలిన్‌, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ ట్వీట్ల పోరు

పశ్చిమబెంగాల్‌ శాసనసభ సెషన్‌ను గవర్నర్‌ ప్రొరోగ్‌ చేసిన వ్యవహారంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఆ అధికారం గవర్నర్‌కు లేదని.. ఇలా చేయడం నిబంధనలు, సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని సుస్థిరం చేయడంలో ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. మమతా బెనర్జీకి బాసటగా స్టాలిన్‌ చేసిన ఈ ట్వీట్‌పై

Updated : 14 Feb 2022 06:56 IST

చెన్నై, న్యూస్‌టుడే: పశ్చిమబెంగాల్‌ శాసనసభ సెషన్‌ను గవర్నర్‌ ప్రొరోగ్‌ చేసిన వ్యవహారంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఆ అధికారం గవర్నర్‌కు లేదని.. ఇలా చేయడం నిబంధనలు, సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని సుస్థిరం చేయడంలో ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. మమతా బెనర్జీకి బాసటగా స్టాలిన్‌ చేసిన ఈ ట్వీట్‌పై పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ఘాటుగా స్పందించారు. వాస్తవాలను పరిశీలించకుండా తీవ్రవ్యాఖ్యలు చేశారంటూ రీట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్థన మేరకే శాసనసభను ప్రొరోగ్‌ చేసినట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని