Arvind Kejriwal: ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌పై హర్షం

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడాన్ని విపక్ష నేతలు స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయమని ఆప్‌ అభివర్ణించింది. 

Published : 10 May 2024 16:38 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi Excise Policy Scam Case)లో శుక్రవారం దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఆప్‌ నేతలు స్పందించారు. ‘‘రాజ్యాంగాన్ని విశ్వసించే ప్రతిఒక్కరికీ సుప్రీంకోర్టు తీర్పు ఒక ఆశాకిరణం లాంటిది. మా పార్టీ, దిల్లీ ప్రజల తరఫున కృతజ్ఞతలు. ఇది కేజ్రీవాల్‌కు దక్కిన ఊరట మాత్రమే కాదు.. సత్యానికి దక్కిన విజయం కూడా. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి దక్కిన భారీ విజయం. ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో కోర్టు కీలక పాత్ర పోషించింది. అసాధారణ పరిస్థితుల్లో ఈ బెయిల్ మంజూరైంది’’ అని హర్షం వ్యక్తం చేశారు. ఒక గొప్ప ఉద్దేశం కోసం ఆయన బయటకు వస్తున్నారని వ్యాఖ్యానించారు.

కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సుప్రీం

అలాగే పలువురు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు కూడా ఈ బెయిల్‌పై స్పందించారు. ‘‘కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుంది’’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేడా మాట్లాడుతూ..‘‘ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తూ సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులను మేం స్వాగతిస్తున్నాం. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు కూడా తగిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో దిల్లీ సీఎం జూన్‌ 1 వరకు బెయిల్‌ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు