హిజాబ్‌ వివాదంపై ముగిసిన విచారణ

హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టులో శుక్రవారం విచారణ ముగిసింది. తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది. హిజాబ్‌ను అనుమతించాలని, నిషేధించాలని 9 రిట్‌ పిటిషన్లు, మరో

Published : 26 Feb 2022 04:44 IST

కర్ణాటక హైకోర్టులో తీర్పు రిజర్వు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టులో శుక్రవారం విచారణ ముగిసింది. తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది. హిజాబ్‌ను అనుమతించాలని, నిషేధించాలని 9 రిట్‌ పిటిషన్లు, మరో 39 మధ్యంతర అర్జీలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి, జస్టిస్‌ కృష్ణ దీక్షిత్‌, జస్టిస్‌ జె.ఎం.ఖాజీల త్రిసభ్య ధర్మాసనం 11 రోజుల పాటు విచారణ జరిపింది. శుక్రవారం హిజాబ్‌కు మద్దతుగా దాఖలైన పిటిషన్లపై సీనియర్‌ న్యాయవాదులు రవివర్మ కుమార్‌, యూసుఫ్‌ ముచ్చల, మహ్మద్‌ తాహిర్‌ వాదనలు వినిపించారు. లౌకికవాదం పేరిట విద్యాలయాల్లో హిజాబ్‌ను నిషేధించిన ప్రభుత్వం ఇదే నిబంధనలను మాల్స్‌, సినిమాలు, బహిరంగ ప్రదేశాల్లోనూ అమలు చేసే ప్రమాదం ఉందని తాహిర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 1400 ఏళ్లుగా ముస్లింల సాంస్కృతిక పరంపరలో భాగంగా వస్తున్న హిజాబ్‌ను నిషేధిస్తే ఆడపిల్లలు మానసికంగా కుంగిపోతారని న్యాయవాది డాక్టర్‌ వినోద్‌ కులకర్ణి కోర్టుకు విన్నవించారు. అల్ప సంఖ్యాక విద్యాసంస్థలు, మహిళా సంఘం, మాధ్యమాల వీడియో చిత్రీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పలు అర్జీలను కోర్టు తిరస్కరించింది. ఈ వివాదంపై అభ్యంతరాలేవైనా ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని సూచించిన కోర్టు.. ఈ విచారణ ముగిసినట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని