Covid Vaccine: పిల్లల కోసం మరో కరోనా టీకా

పిల్లలకు సంబంధించి మరో కరోనా టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. 12 నుంచి 17 సంవత్సరాల పిల్లల కోసం కొన్ని షరతులతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవోవ్యాక్స్‌ అత్యవసర వినియోగానికి

Updated : 10 Mar 2022 08:16 IST

కొవోవ్యాక్స్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

దిల్లీ: పిల్లలకు సంబంధించి మరో కరోనా టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. 12 నుంచి 17 సంవత్సరాల పిల్లల కోసం కొన్ని షరతులతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవోవ్యాక్స్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ పచ్చజెండా ఊపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత్‌లో 18 ఏళ్ల లోపు పిల్లలకు అందుబాటులోకి వచ్చిన నాలుగో వ్యాక్సిన్‌గా కొవోవ్యాక్స్‌ నిలవనుంది. ఇదిలా ఉంటే.. 15 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌ వేసే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీనిపై మరింత అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు