ఎంత పని చేశావే పిల్లీ..రూ.100 కోట్ల నష్టం!

‘పిల్లి శాపాలకు ఉట్టి తెగదు’ అన్నది సామెత. కానీ, మహారాష్ట్రలోని పుణె పట్టణ శివారున పింప్రీ - చించ్వడ్‌ ప్రాంతంలో ఏకంగా 60 వేల విద్యుత్తు కనెక్షన్లు తెగిపోయాయి. అంతేనా?.. అక్కడున్న పారిశ్రామిక ప్రాంతం

Published : 24 Mar 2022 07:25 IST

పుణె: ‘పిల్లి శాపాలకు ఉట్టి తెగదు’ అన్నది సామెత. కానీ, మహారాష్ట్రలోని పుణె పట్టణ శివారున పింప్రీ - చించ్వడ్‌ ప్రాంతంలో ఏకంగా 60 వేల విద్యుత్తు కనెక్షన్లు తెగిపోయాయి. అంతేనా?.. అక్కడున్న పారిశ్రామిక ప్రాంతం భోసారిలో ఏకంగా ఏడువేల మంది వ్యాపారులు విద్యుత్తు అంతరాయంతో ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా వీరికి జరిగిన నష్టం రూ.వంద కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇంతకూ ఏం జరిగిందంటే.. ఓ పిల్లి మహా ట్రాన్స్‌మిషన్‌ సబ్‌స్టేషనులోని ట్రాన్స్‌ఫార్మరు మీదికి ఎక్కింది. షార్ట్‌ సర్క్యూటుతో భోసారి, భోసారి ఎం.ఐ.డి.సి. (పారిశ్రామిక ప్రాంతం), అకుర్ది ప్రాంతాల్లో 60 వేల మంది వినియోగదారులకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రాంత కుటీర పరిశ్రమల సంఘం అధ్యక్షుడు సందీప్‌ బెల్‌సారె మాట్లాడుతూ.. తక్షణం విద్యుత్తుశాఖ మంత్రి స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. మరో మూడు రోజులపాటు పునరుద్ధరణ అవకాశాలు కనిపించడం లేదు. విద్యుత్తు పొదుపుగా వాడాలని, భారమంతా సింగిల్‌ ట్రాన్స్‌ఫార్మరుపై పడుతోందని ఆ శాఖ అధికారి జ్యోతి చిప్టే స్థానికులకు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని