Taj Mahal: తాజ్‌మహల్‌ స్థలం జైపుర్‌ రాజు జైసింగ్‌ది

ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను నిర్మించిన స్థలం నిజానికి జైపుర్‌ మహారాజు జైసింగ్‌కు చెందుతుందని, దానిని మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ స్వాధీనం చేసుకున్నారని భాజపా ఎంపీ దియా కుమారి చెప్పారు. జైపుర్‌ రాజ కుటుంబికుల వద్ద

Updated : 12 May 2022 09:53 IST

భాజపా ఎంపీ దియాకుమారి వెల్లడి

జైపుర్‌: ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను నిర్మించిన స్థలం నిజానికి జైపుర్‌ మహారాజు జైసింగ్‌కు చెందుతుందని, దానిని మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ స్వాధీనం చేసుకున్నారని భాజపా ఎంపీ దియా కుమారి చెప్పారు. జైపుర్‌ రాజ కుటుంబికుల వద్ద దీనికి సంబంధించిన రికార్డులు ఉన్నాయని, అవసరమైతే వాటిని వారు అందిస్తారని అదే కుటుంబానికి చెందిన ఆమె చెప్పారు. బుధవారం జైపుర్‌లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తీసుకున్న స్థలానికి షాజహాన్‌ పరిహారం ఇచ్చినా దానిని జైపుర్‌ రాజు అంగీకరించారా లేదా అనేది మాత్రం రికార్డుల పరిశీలన తర్వాతే తెలుస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని