ఆరోగ్య సంరక్షకులు ఆశా వర్కర్లు: మోదీ

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌ పురస్కారానికి ఎంపికైన ఆశా వర్కర్ల బృందాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఆరోగ్య భారత్‌కు వాళ్లు రక్షకులని ప్రశంసించారు. భారత్‌కు చెందిన 10 లక్షల మంది ఆశా వర్కర్లు

Published : 24 May 2022 05:10 IST

దిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌ పురస్కారానికి ఎంపికైన ఆశా వర్కర్ల బృందాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఆరోగ్య భారత్‌కు వాళ్లు రక్షకులని ప్రశంసించారు. భారత్‌కు చెందిన 10 లక్షల మంది ఆశా వర్కర్లు కొవిడ్‌-19 విజృంభణ సమయంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ అద్భుతమైన వైద్య సేవలను అందించినందుకు గాను గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌ అవార్డును డబ్లూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటించారు. జెనీవాలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ ప్రతినిధి సీమా పుజానీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

వేతనాలు పెంచాలి: విపక్ష నేతలు

ఆశా వర్కర్లకు వేతనాలు పెంచడంతో పాటు పని పరిస్థితులను మెరుగుపరచాలని విపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్లకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అర్హత వారికి ఉందని కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక ట్వీట్‌ చేశారు. ఆశా వర్కర్లను గౌరవప్రదంగా చూడాలని కేంద్రానికి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని