Train: ఈ రైలు నిమిషాలు, గంటలు కాదు.. ఏడాది ఆలస్యం!

మన దేశంలో రైళ్ల రాకపోకలు ఆలస్యమవడం సాధారణమే. నిర్ణీత సమయం కంటే కొన్ని నిమిషాలు/గంటల తేడాలో అవి గమ్యస్థానానికి చేరుకుంటుంటాయి! అందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ తాజాగా

Updated : 28 May 2022 11:29 IST

న దేశంలో రైళ్ల రాకపోకలు ఆలస్యమవడం సాధారణమే. నిర్ణీత సమయం కంటే కొన్ని నిమిషాలు/గంటల తేడాలో అవి గమ్యస్థానానికి చేరుకుంటుంటాయి! అందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ తాజాగా ఝార్ఖండ్‌లోని తన గమ్యస్థానానికి చేరుకున్న ఓ గూడ్సు రైలు గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే దాని రాక ఏకంగా ఏడాది ఆలస్యమైంది.. ఇది నిజం. 2021 మేలో ఛత్తీస్‌గఢ్‌లోని ఓ రైల్వేస్టేషన్‌లో ఒక రైలు బోగిని వెయ్యి బియ్యం బస్తాలతో నింపారు. 762 కిలోమీటర్లు ప్రయాణించి ఝార్ఖండ్‌లోని న్యూ గిరిడీ స్టేషన్‌ను అది చేరుకోవాలి. సాంకేతిక కారణాలతో అది నిర్ణీత సమయానికి ముందుకు కదలలేదు. తర్వాత దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ బోగితో గూడ్సు రైలు ఎట్టకేలకు ఏడాది ఆలస్యంగా ఈ నెల 17న న్యూ గిరిడీ స్టేషన్‌ను చేరుకుంది. ఏడాది ఆలస్యం కావడంతో.. 200-300 బస్తాల బియ్యం పాడైపోయిందని అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని