‘స్వచ్ఛ’ ధ్రువీకరణకు సవరించిన మార్గదర్శకాలు

ఆరుబయట మలవిసర్జన రహితమైన ప్రదేశాలుగా పట్టణ ప్రాంతాలు కొనసాగేలా చూసి, పారిశుద్ధ్యం పరంగా నూతన లక్ష్యాలను చేరుకునే ఉద్దేశంతో స్వచ్ఛభారత్‌ ధ్రువీకరణకు కేంద్ర గృహ నిర్మాణ- పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కొన్ని మార్గదర్శకాలను సవరించింది.

Updated : 26 Jun 2022 05:48 IST

దిల్లీ: ఆరుబయట మలవిసర్జన రహితమైన ప్రదేశాలుగా పట్టణ ప్రాంతాలు కొనసాగేలా చూసి, పారిశుద్ధ్యం పరంగా నూతన లక్ష్యాలను చేరుకునే ఉద్దేశంతో స్వచ్ఛభారత్‌ ధ్రువీకరణకు కేంద్ర గృహ నిర్మాణ- పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కొన్ని మార్గదర్శకాలను సవరించింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ (ఎస్‌బీఎం) మొదలైన ఏడేళ్లలో లక్షల మంది పౌరులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు హుందాతనాన్ని, భద్రతను తీసుకురాగలిగామని తెలిపింది. శుద్ధి చేయకుండా మురుగునీటిని బయటకు వదిలిపెట్టరాదని, శుద్ధి చేసిన నీటిని గరిష్ఠస్థాయిలో పునర్వినియోగించాలని లక్షలోపు జనాభా ఉన్న నగరాలన్నింటికీ సూచించింది. పరిశుభ్రమైన నగర భారతాన్ని సాధించడానికి మౌలిక సదుపాయాల పరంగా ఎలాంటి వసతులు సమకూర్చుకోవాలో తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని