వడ్డీలేని రుణాలుగా రాష్ట్రాలకు రూ.80,000 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టే మూలధన పనుల కోసం రాష్ట్రాలకు వడ్డీరహిత రుణాలుగా రూ.80,000 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇలాంటి పనుల నిమిత్తం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల సాయం చేస్తామనీ, 50 ఏళ్లలో

Published : 08 Jul 2022 04:12 IST

పీఎం గతిశక్తి పనులకు ప్రాధాన్యం

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టే మూలధన పనుల కోసం రాష్ట్రాలకు వడ్డీరహిత రుణాలుగా రూ.80,000 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇలాంటి పనుల నిమిత్తం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల సాయం చేస్తామనీ, 50 ఏళ్లలో వడ్డీ లేకుండా దీనిని తీర్చాలని బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆ మేరకు రూ.80,000 కోట్లను రిజర్వు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. వీటి వినియోగానికి మార్గదర్శకాలు జారీ చేసింది. పథకం కింద రుణం పొందాలంటే ఆ ప్రాజెక్టు పేరు, మూలధన వ్యయం, పని పూర్తయ్యేందుకు తీసుకునే వ్యవధి, ప్రాజెక్టు చేపట్టడం ఎందుకు అవసరం వంటి వివరాలను రాష్ట్రాలు కేంద్ర ఆర్థిక శాఖలో వ్యయ విభాగానికి సమర్పించాల్సి ఉంటుంది. ‘పీఎం గతిశక్తి బృహత్‌ ప్రణాళిక’ కింద చేపట్టే పనులకు ప్రాధాన్యమిస్తామని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సాయంగా మరో రూ.5,000 కోట్లను వడ్డీలేని రుణాలుగా కేంద్రం ఇస్తుంది. ఈ ప్రోత్సాహకం ఒక రాష్ట్రానికి గరిష్ఠంగా రూ.1,000 కోట్లు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని