యుద్ధవిమానాలను హద్దుల్లో ఉంచండి

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కు చాలా దగ్గరగా చైనా యుద్ధవిమానాలు రావడంపై భారత్‌ అభ్యంతరం వ్యక్తంచేసింది. రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన ప్రత్యేక సైనిక చర్చల్లో దీనిపై తన ఆందోళనలను డ్రాగన్‌కు తెలియజేసినట్లు అధికార

Published : 06 Aug 2022 04:16 IST

చైనాకు భారత్‌ స్పష్టీకరణ

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కు చాలా దగ్గరగా చైనా యుద్ధవిమానాలు రావడంపై భారత్‌ అభ్యంతరం వ్యక్తంచేసింది. రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన ప్రత్యేక సైనిక చర్చల్లో దీనిపై తన ఆందోళనలను డ్రాగన్‌కు తెలియజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎల్‌ఏసీ నుంచి పది కిలోమీటర్ల దూరంలోకి యుద్ధవిమానాలు ప్రవేశించరాదని చైనాకు స్పష్టంచేసినట్లు వివరించాయి. జూన్‌ చివరివారంలో డ్రాగన్‌కు చెందిన జె-11 యుద్ధవిమానం ఎల్‌ఏసీకి దగ్గరగా గగనవిహారం చేసింది. దాన్ని తరిమేయడానికి మన దేశం కూడా జెట్‌లను పంపాల్సి వచ్చింది. అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో లద్దాఖ్‌లోని చుషుల్‌-మోల్దో సరిహద్దు శిబిరం వద్ద రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. శాంతి పరిరక్షణ కోసం.. విశ్వాసం పాదుగొల్పే చర్యలను తీసుకోవాల్సిన అవసరాన్ని భారత బృందం ప్రస్తావించింది. ఎల్‌ఏసీ నుంచి 10 కిలోమీటర్ల ప్రాంతం ‘బఫర్‌ జోన్‌’గా ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ, దాన్ని అతిక్రమించరాదని స్పష్టంచేసింది.

కశ్మీర్‌ వివాదాన్ని చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్‌, పాకిస్థాన్‌లకు చైనా సూచించింది. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం దీనిపై స్పందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు