Published : 07 Aug 2022 05:39 IST

పంజాబ్‌లో లంపీ వ్యాధి పంజా

నెల రోజుల్లో 400 పశువులు బలి

చండీగఢ్‌: లంపీ చర్మవ్యాధితో పంజాబ్‌లో నెలరోజుల వ్యవధిలో 400కుపైగా పశువులు మృత్యువాతపడ్డాయి. దాదాపు 20వేల మూగజీవాలు ఈ రుగ్మత బారినపడ్డాయి. వీటిలో ఆవులే అధికమని అధికారులు శనివారం తెలిపారు. బర్నాలా, బటిండా, ఫరీద్‌కోట్‌ జలంధర్‌, మోగా, ముక్తసర్‌ జిల్లాల్లో ఈ వ్యాధి ప్రబలంగా ఉంది. పశుసంవర్ధక శాఖ మంత్రి లాల్జిత్‌ సింగ్‌ భుల్లర్‌.. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వ్యాధి వ్యాప్తి కట్టడికి అన్ని చర్యలూ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలకు రూ.76 లక్షలను విడుదల చేసినట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఇతర రాష్ట్రాల నుంచి పశువులను కొనుగోలు చేయవద్దని రైతులను కోరారు. వైరస్‌ వల్ల కలిగే లంపీ వ్యాధి.. ఈగలు, దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల పశువుల శరీరాలపై పొక్కులు లాంటివి వస్తాయి. జ్వరం, కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, పాల దిగుబడి తగ్గిపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని