మధ్యప్రదేశ్‌లో పిడుగులు పడి 9 మంది మృత్యువాత

మధ్యప్రదేశ్‌లో వేర్వేరు చోట్ల పిడుగులు పడి 24 గంటల వ్యవధిలో 9 మంది మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు గాయపడ్డారు. విదిశా జిల్లాలోని అగసొద్‌ గ్రామంలో వర్షం పడుతుండగా చెట్టుకింద

Published : 08 Aug 2022 05:45 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో వేర్వేరు చోట్ల పిడుగులు పడి 24 గంటల వ్యవధిలో 9 మంది మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు గాయపడ్డారు. విదిశా జిల్లాలోని అగసొద్‌ గ్రామంలో వర్షం పడుతుండగా చెట్టుకింద నిలుచున్న వారిపై పిడుగు పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారే. సత్నా జిల్లాలోని పొడి-పటౌరా, జత్వారా గ్రామాల్లో పిడుగుపాటుకు గురై నలుగురు దుర్మరణం పాలయ్యారు. అక్కడ ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గున జిల్లాలోని భోర గ్రామంలో పిడుగుపడి 45 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో గత 24 గంటల్లో భారీ వర్షం పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని