చెన్నైలో ఉత్సాహంగా మారథాన్‌

చెన్నైలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మారథాన్‌కు ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 4వ వర్ధంతి సందర్భంగా చెన్నైలో ఆదివారం 4 విభాగాలుగా ఈ మారథాన్‌ను డీఎంకే

Published : 08 Aug 2022 05:45 IST

ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నైలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మారథాన్‌కు ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 4వ వర్ధంతి సందర్భంగా చెన్నైలో ఆదివారం 4 విభాగాలుగా ఈ మారథాన్‌ను డీఎంకే నిర్వహించింది. బెసెంట్‌ నగర్‌ నుంచి 5, 10, 21, 42 కి.మీ. దూరానికి జరిగిన పోటీల్లో 43,320 మంది పాల్గొన్నారు. వారిలో 10,985 మంది మహిళలు. దీనిని ఆసియాలో అతిపెద్ద స్మారక మారథాన్‌గా ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు గుర్తించారు. ఆ మేరకు డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ధ్రువీకరణ పత్రం అందించారు. రిజిస్ట్రేషన్ల ద్వారా లభించిన రూ.1,20,69,950లను ఆరోగ్యశాఖ కార్యదర్శి సెంథిల్‌ కుమార్‌కు సీఎం అందజేశారు. ఎగ్మూరులోని ప్రభుత్వ పిల్లలు, మాతా శిశు ఆస్పత్రికి ఈ మొత్తం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని